Signs of Death – May be Myth but interesting to Know

మరణ సుచనలు అనుసరించి మరణ సమయం తెలుసుకొనుట –

* ఎవనికి నాలుక నల్లగా ముఖము కుంకుమ వలే ఎర్రగా నుండునో వానికి ఒక సంవత్సరం లొపల మరణం తప్పదు.

* చెట్టు మొదల యందు , కొమ్మల యందు నిప్పు తునకలు రాలుచున్నట్లు కనిపించునో వాడి ఆయుర్దాయం నెలలు మాత్రమే !..

* మలము , రేతస్సు, మూత్రము నురుగుతో గూడిన మలము ఇవి యోకానప్పుడు స్వభావ విరుద్ధముగా అనేక విధములుగా కనపడిన, అన్నమును భుజించిన వెంటనే ఆకలి పుట్టినను ఒక సంవత్సరంలో మరణించును.

* ఆకాశం నందు ఇంద్రనీల సధ్రుశమ్బులైన సర్పంబుల గుంపు కనపడిన ఆరు నెలలు జీవించి యుండును. ఎల్లప్పుడు ఉదరం ఉబ్బి యుండుటయు అహోరాత్రములు నీరు తాగుట యందు ఇచ్చ కలిగి ఉండిన 4 నుంచి 6 నెలలు జీవించును.

* నలుపు , పసుపు మొదలగు వర్ణములను , కారము, పులుసు, ఉప్పు గల ద్రవ్యములను అకస్మాతుగా వ్యత్యముగా నెరింగినను 6 నెలలలోపు మృత్యువు తప్పదు.

* తన ముఖ ప్రతిబింబమును గాని , శరీరం గాని వాన నీటి యందును, అద్దము నందు ను కనపడకుండా యుండిన 6 నెలలలొపు మృతి నొందును.

* మేఘము లేనపుడు మెరుపును , దక్షిణ దిక్కున ఇంద్ర ధనస్సు ను అగుపడిన 3 నెలలు బ్రతుకును. శరీరం నందు కాంతి లేనివాడు , కామరహితుడు గా రుచి తెలియనివాడు గా ఉండిన 3 నెలలు మీద మృతి నొందును.

* దేహం అకస్మాత్తుగా స్థూలంగా అయ్యి క్రుశించినను ఒక నెలలొపు మరణం గలుగును. నేయి , నూనె , అద్దము , నీరు యందు తన దేహము వానర దేహము వలే అగుపడిన ను , శిరము లేనట్లు అగుపడిన ను ఒక నెలకు మించి బ్రతకడు.

* హటాత్తుగా దేహము నందు శక్తి లేకుండా ఉండుట , పాండు వర్ణం , మిక్కిలి నిచ్చ్వాసం వచ్చుట, నిత్యం మలమునకు పలుమార్లు వెల్లుట ఇవి గలిగిన యెడల ఒక మాసం జీవించును.

* నడిరేయి నందు ఇంద్రదనస్సు ను , పగలు చంద్ర గ్రహణము కనపడిన ఆయు క్షీణం కలుగును అని తెలియునది. ముక్కు వంకర అయ్యి , చెవులు పొడుగు అయ్యి , కన్నుల యందు నీరు స్రవిన్చుచు కన్నులు ఉన్నతములు అయ్యి ముఖం ఎర్రగానూ , నాలుక లోపలకీడ్చుకు పోయి ఉండిన ఒక మాసములో మరణం కలుగుతుంది అని తెలియును.

* దీపం ఆరినప్పుడు వాసన తెలియకుండిన , మిత్రుల మాటలు తెలియకున్ది నను , అరుంధతి నక్షత్రం కనపడకుండా ఉండిన , ధ్వని వినరాకుండా ఉండిన ఆయుక్షీనం

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *