“Rajadhani Express” ran without driver

మడగావ్‌-నిజాముద్దిన్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సమస్య కారణంగా ఆగిపోయిన రైలు ఒక్కసారిగా కదిలి.. దాదాపు 15 కిలోమీటర్లు డ్రైవర్‌ లేకుండా ప్రయాణించింది. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. అసలేం జరిగిందంటే..

మడగావ్‌-నిజాముద్దిన్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో మహారాష్ట్రలోని రత్నగిరి స్టేషన్‌ సమీపంలోని ఓ సొరంగ మార్గం వద్ద నిలిపివేశారు. అయితే ఓ వైపు టెక్నీషియన్లు సరిచేస్తుండగానే.. రైలు ఉన్నట్లుండి కదలడం ప్రారంభించింది. అలా దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ సమయంలో డ్రైవర్‌ గార్డు క్యాబిన్‌లో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని సీనియర్‌ రైల్వే అధికారులు కూడా ధ్రువీకరించారు. ఇంజిన్‌ వ్యాక్యూమ్‌ బ్రేక్‌ తొలగించడంతో రైలు వాలుగా ఉన్న ప్రాంతం వైపు కదిలిందని అధికారులు చెప్పారు. డ్రైవర్‌ వెంటనే బ్రేకులు వేసి రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. అనంతరం మరో ఇంజిన్‌ను ఏర్పాటుచేసి రైలును సమీపంలోని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.

rajdhani-express

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *