New Hairstyle in Kohli

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన ఆటతో పాటు ఆహార్యంతోనూ అభిమానులను అలరిస్తున్నాడు. కోహ్లీ ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్లతో యువతను ఆకట్టుకుంటున్నాడు. విరాట్‌ మళ్లీ తన హెయిర్‌ స్టయిల్‌ మార్చాడు. వెస్టిండీస్‌ టూర్‌కు ముందు కోహ్లీ ‘క్రూ కటింగ్‌’ స్టయిల్‌లోకి మారిపోయాడు. తన కొత్త గెటప్‌ ఎలా ఉందంటూ ఓ ఫొటోను కోహ్లీ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. కోహ్లీ సారథ్యంలో భారత టెస్ట్‌ జట్టు జులై 21 నుంచి వెస్టిండీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో పోటీపడనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్‌ కంటే ముందు టీమిండియా జులై 9 నుంచి రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.

kohle

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *