M.Tech & M.Ed Candidates Applay to Muncipal Jobs

కడప, ఎర్రముక్కపల్లె: జిల్లాలో ఉద్యోగాల కోసం యువత ఏవిధంగా ఎదురుచూస్తుందో పారిశుధ్య కార్మిక పోస్టులకు వచ్చిన దరఖాస్తులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చిన్న ఉద్యోగాలకు సైతం పోటీ పెరిగిపోయే పరిస్థితి నెలకొంది. వయసు మీరిపోతుందన్న భయంతో కొందరు ప్రభుత్వ ఉద్యోగం దొరికితే చాలని, పోటీపడి దరఖాస్తు చేస్తున్నారు. నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుల పోస్టులకు బీటెక్‌, ఎంటెక్‌ అభ్యర్థులతో పాటు బీఎడ్‌, ఎంఎడ్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దరఖాస్తు నమోదుకు రెండు రోజులు గడువున్నా ఇప్పటికే 2500 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అంటే నిరుద్యోగ సమస్య ఏ విధంగా వుందో స్పష్టమవుతోంది. నగరపాలక సంస్థపరిధిలో బ్యాక్‌లాగ్‌ పోస్టులకు సంబంధించి 18 పోస్టులకు నోటిఫికేషన జారీ చేశారు.
వీటిలో ఎస్టీ అభ్యర్థులకు 7 పోస్టులు, ఎస్సీ అభ్యర్థులకు 11 పోస్టులు ఖరారు చేశారు. అభ్యర్థులు దరఖాస్తుకు ఈ నెల 20 వరకు గడువు ఇచ్చారు. అయితే శుక్రవారం నాటికి 2500 పైగా దరఖాస్తులు కార్పొరేషన కార్యాలయానికి చేరాయి. ప్రధానంగా పారిశుధ్య కార్మికుల పోస్టులకు విద్యార్హత 7వ తరగతి. కానీ బీటెక్‌, ఎంటెక్‌, బీఎడ్‌, ఎంఈడీ అభ్యర్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. టెన్త, డిగ్రీ, పీజీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నవారిలో వున్నారు. 7వతరగతి వరకు మాత్రమే చదువుకొని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ విషయాలు తెలుసుకొని బెంబేలెత్తుతున్నారు. గడువు ముగిసే సమయానికి భారీగా దరఖాస్తులు వచ్చేఅవకాశముందని భావిస్తున్నారు.
134

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *