Hitech Thieves

కారు కొనాలంటూ షోరూంకు వెళ్లారు ఓ తండ్రీకొడుకులు. ఖరీదైన బెంజ్‌ను ఎంపిక చేసుకున్నారు. కొనేముందు ఓసారి టెస్ట్‌డ్రైవ్‌ చేస్తామని వెళ్లి.. కారుతో సహా ఉడాయించారు. దేశరాజధాని దిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనిల్‌ ఆనంద్‌ తన కుమారుడు సాహిల్‌తో కలిసి మే 6న కారు కొనేందుకు షోరూమ్‌కు వెళ్లారు. మెర్సిడెస్‌ బెంజ్‌లోని ఓ మోడల్‌ను చూసి టెస్ట్‌డ్రైవ్‌ చేస్తామన్నారు. ఇందుకు ఆ షోరూం సిబ్బంది కూడా అంగీకరించడంతో కారు తీసుకుని వెళ్లారు. అయితే డ్రైవ్‌ కోసం వెళ్లిన వారు ఎంతకీ తిరిగిరాకపోవడంతో షోరూం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం గుడ్‌గావ్‌ సమీపంలో నిందితులను గుర్తించారు. తండ్రీకొడుకులను అరెస్టు చేసి.. వారి నుంచి బెంజ్‌ కారును స్వాధీనం చేసుకున్నారు.

bengh car

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *