12 Natural Remedies to reduce Body Fat

“బాడీ ఫ్యాట్ ను ఇట్టే కరిగించేసే 12 నేచురల్ రెమెడీస్”

చాలా మంది కొంచెం లావు అయితే చాలు అయ్యే చాలా లావు అయిపోయాను అని హైరానా పడిపోతూ బరువు తగ్గడానికి చిట్కాలను వెదుకుతారు. సాధారణంగా ఎందుకు బరువు తగ్గాలనుకొంటారు..?శరీరం నాజుగ్గా ఉంచుకోడం కోసం కొంత మంది ప్రయత్నిస్తే మరి కొంత మంది ఆరోగ్యం కోసమంటారు. మరికొంత మంది సెక్సీగా కనబడటానికి అంటారు. ఏదైమైన వయస్సుకు మిచ్చిన బరువు ఉండటం ఇలా శరీరానికే కాకుండా అలా ఆరోగ్యానికి కూడా హానికరమే. అయితే ఆ బరువును తగ్గించుకోవడానికి గంటల తరబడి జిమ్ కెలుతుంటారు.
మీ నడుము చుట్టుకొలతను తగ్గించే వెచ్చని ఆహారాలు..

జిమ్ కి వెళ్లి నానా తంటాలు పడి ఫ్యాట్ బర్న్ గి చేయాలను కొంటారు. అయితే అందువల్ల అతి తక్కువ మోతాదులో మాత్రమే కొవ్వును కరిగించడం జరుగుతుంది. అయితే దాని వల్ల శరీరంలో ఒకే సారి కొన్ని జీవక్రియలపై ప్రభావం చూపెడుతుంది. శరీరంలోని మినరల్స్ తగ్గిపోతాయి. శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి జిమ్ కు వెళ్ళకుండానే జీర్ణక్రియ ద్వారా మీ శరీర సామర్థాన్ని పెంచుకోవడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి.

శరీరంలో త్వరగా కొవ్వు కరిగించి, బరువు తగ్గించే 22 చౌకైనఇండియన్ ఫుడ్స్

వ్యాయామంతోపాటు..పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని నేచురల్ రెమెడీస్(పానీయాలు)గ్రేట్ గా సహాయపడుతాయి). అప్పుడే శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చూడచక్కని రూపం మన సొంతమవుతుంది.

జింజర్ టీ లేదా జింజర్ వాటర్ –

ఇంటిలోనే చికిత్స చేసుకోగల మంచి మందు అల్లం. కొవ్వును బాగా కరిగిస్తుంది. ప్రతిరోజూ పాలు లేదా టీ లో ఒక్క చెంచా అల్లం రసం వేసుకుంటే శారీరక కొవ్వు కరిగి ఫిట్ గా వుంటారు. బాడీ ఇన్ఫ్లమేషన్ మరియు బరువును పెంచే టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగించడానికి జింజర్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతాయి .

గోధుమ గడ్డి జ్యూస్ లేదా వీట్ గ్రాస్ వాటర్ –

దీనిలో కావలసినంత పీచు పదార్ధం వుంటుంది. జ్యూస్ గా చేసి తాగేయాలి. ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్ పుష్కలంగా వుంటాయి. ఇంటిలో దీనిని పెంచుకొనవచ్చు.

కేయాన్ పెప్పర్ వాటర్ –

ఇది కూడా జీర్ణక్రియను పెంచి జీవ క్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వు బాగా తగ్గిస్తుంది. అయితే మితంగా వాడాలి. వైద్యుల సలహా కూడా అవసరం.ఒక గ్లాసు లెమన్ వాటర్ లో కేయాన్ పెప్పర్ ను ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి, ఉదయం పరగడుపున త్రాగాలి. ఈ డ్రింక్ తాగిన ఒక గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. కేయాన్ పెప్పర్లో ఉండే క్యాప్ససిన్ మెటబాలిజం రేటును పెంచుతుంది. దాంతో బరువు తగ్గుతారు . అంతే కాదు బాడీ ఫ్యాట్ ను కూడా చాలా వేగంగా కరిగిస్తుంది

మోసంబి జ్యూస్ లేదా మోసంబి వాటర్ : –

నిమ్మ జాతి పండు. ఇది శరీరంలోని కొవ్వు నిల్వలను ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిస్తుంది. గుండె సమస్యలకు కూడా బాగా పని చేస్తుంది.

గ్రీన్ టీ :-

ఈ మూలిక బరువు తగ్గటానికి మంచి యాంటి ఆక్సిడెంట్లు కలది. దీనిని ప్రతిరోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే అదనపు కేలరీలు ఖర్చయి ఆరోగ్యం ఇస్తుంది.

లెమన్ వాటర్:

బరువు తగ్గించుకోవడంలో లెమన్ వాటర్ గ్రేట్ . ఎఫెక్టివ్ హోం రెమెడీ. గోరువెచ్చని లెమన్ వాటర్లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ఎర్లీమార్నింగ్ పరగడుపుతో తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. లెమన్ వాటర్ త్రాగిన 1గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఈ ఎర్లీ మార్నింగ్ డ్రింక్ మిమ్మల్ని స్లిమ్ గా మార్చడంతో మాత్రమే కాదు బెల్లీఫ్యాట్ ను కరిగిస్తుంది.

తేనె హానీ వాటర్ :

పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క…కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.

మొలకెత్తిన పెసలు:-

వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి. అదనపు కేలరీలు తొలగించుకోడానికి ఈ పది ప్రధానంగా పనిచేసి మంచి ఫలితాలనిస్తాయి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *