నేరేడు పండు ఉపయోగాలు

సీజన్‌లో దొరికే ప్రతి పండు ఆరోగ్యానికి మంచిదని వైద్య, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటిలో నేరేడు పండు ప్రత్యేకత సంతరించుకుంది. ఆయుర్వేదంలో నేరేడు పండును అమర సంజీవనిగా కీర్తిస్తారు. ఈ పండులో ఏ, సీ విటమిన్‌లతో పాటు ఆక్జాలిక్‌ ఆమ్లం ఉండడంతో మంచి రుచి ఇస్తుంది. నేరేడులో విషాన్ని హరించే శక్తి మెండుగా ఉంటుందని పురాణ వైద్యశాస్త్రంలో విస్తృతంగా వాడేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. కిలో రూ.120 నుంచి 150 వరకు ధర పలుకుతోంది.
  • నేరేడు పండు తింటే కడుపులో నులిపురుగులను చంపడంతోపాటు నోటి కేన్సర్‌కు ఔషధంగా పనిచేస్తుంది.
  •  మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు వరప్రసాదిని. నేరేడు పండు గింజలను కాల్చి పొడి చేసిన తరువాత నీటిలో కలిపి తాగితే చక్కర శాతం అదుపులో ఉంటుంది.
  •  మూత్రాశయ సమస్యలు ఉన్న వారికి టానిక్‌లా పని చేస్తుంది. డయేరియాను కూడా నివారిస్తుంది.
  •  నేరేడు ఆకులు కూడా ఔషధ గుణం కలిగి ఉంటాయి. శరీరంలో ఎక్కడైనా గాయమైతే నేరేడు ఆకును గాయంపై ఉంచి కట్టు కడితే నయమైతుంది.
  •  నోటిపూత, చిగుళ్ళవ్యాధులు, దంతక్షయం ఉన్నా నేరేడు ఆకుల రసాన్ని పుక్కిలిస్తే ఉపశమనం పొందవచ్చు.
  • neredu

Comments

comments

You may also like...