కోటి విరాళం ఇచ్చిన రజనీకాంత్

నదుల అనుసంధానం కోసం తమిళ సినీనటుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్ రూ.కోటి విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు రజనీ సోదరుడు సత్యనారాయణ సోమవారం ప్రకటించారు. నదుల అనుసంధాన ప్రక్రియ పనులు ప్రారంభమైన వెంటనే ఆ నగదును సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ప్రార్థిస్తూ తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో సత్యనారాయణ పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ఇచ్చిన పిలుపునకు రజనీకాంత్ స్పందించి.. తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారని, రూ.కోటి డిపాజిట్‌ చేశారని అన్నారు. ఇటీవల గంగా-కావేరి నదుల అనుసంధానానికి రజనీకాంత్ సాయం చేయాల్సిందిగా రైతు సంఘాల సమాఖ్య నాయకులు కోరిన నేపథ్యంలో.. ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

rajani

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *