ఏసిబి వలలో చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి

ఆయన ఖాకీ. ఆయన ఆచూకీ మాత్రం రౌడీషీటర్‌ వద్ద! బుధవారం విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ కే బాలకృష్ణ ఆస్తులను వెలికితీసే క్రమంలో అవినీతి నిరోధక విభాగం అధికారులను విస్మయపరిచిన అంశం ఇది. నగరంలోని పీఎం పాలెంలోని రౌడీషీటర్‌ నానాజీ ఇల్లు, బాలకృష్ణ కార్యాలయం, నివాసం సహా ఎనిమిది చోట్ల జరిపిన తనిఖీల్లో .రూ.20 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ బృందాలు గుర్తించాయి. రామకృష్ణ గురించి ఆరా తీయగా, రౌడీ షీటర్‌ నానాజీ ఆయనకు కుడిభుజంగా ఉన్నట్టు తెలిసింది. ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని రియల్‌ ఎస్టేట్‌, భవన నిర్మాణం వ్యాపారాలను బాలకృష్ణ నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో ఎక్కడైనా తేడా వస్తే నానాజీ వంటి రౌడీ షీటర్లను రంగంలోకి దింపుతుంటాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కాగా, రామకృష్ణ గతంలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనిచేశారు. దీంతో మరికొన్ని బృందాలు ఆ జిల్లాలకు వెళ్లి తనిఖీలు సాగించాయి. విజయనగరంలోని తల్లిదండ్రుల నివాసం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని అత్తవారింట్లో సోదాలు నిర్వహించాయి. మూడు జిల్లాల పరిధిలో ఏకకాలంలో సాగిన తనిఖీల్లో.. ఏడు ఇళ్ల స్థలాలు, తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి, మూడంతస్తుల నివాసం, మూడంతస్తుల షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఒక అపార్టుమెంట్‌లో ఫ్లోర్‌, రూ.40 లక్షలు విలువచేసే నివాసం (అత్తపేరిట), 25 తులాల బంగారం, మూడు కిలోల వెండి, రూ.30 వేల నగదు వెలికి వచ్చింది. ఆస్తుల విలువ డాక్యుమెంట్ల ప్రకారం రెండు కోట్ల రూపాయలయినా, మార్కెట్‌ విలువ ప్రకారం రూ.20 కోట్లకుపైగా వుండవచ్చునని ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్‌ తెలిపారు. రామకృష్ణపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

acbb

Comments

comments

You may also like...