అనంతపురం విస్తీర్ణం & లభ్యమయ్యే ఖనిజాలు

ఉనికి.. నైసర్గిక స్వరూపం
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా దక్షిణ- నైసర్గిక దిశలో వ్యాపించి ఉంది. జిల్లా 14-40’, 15-15’ ఉత్తర అక్షాంశాలు, 76-50’, 78-31’ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. జిల్లాకు తూర్పున కడప జిల్లా, పశ్చిమాన కర్ణాటక  రాష్ట్రం, ఉత్తరాన కర్నూలు జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లాలు ఎల్లలుగా ఉన్నాయి. జిల్లా దక్షిణం నుంచి ఉత్తరానికి ఏటవాలుగా ఉంటుంది. జిల్లాలో అడవుల విస్తీర్ణం 2.15 లక్షల హెక్టార్లు. ఇది మొత్తం వైశాల్యంలో 10.2 శాతం.
మూడు సహజ భాగాలు
* ఉత్తరాన ఉన్న గుత్తి, గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు, యాడికి, తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, రాయదుర్గం, కణేకల్లు, బెళుగుప్ప మండలాల్లో నల్లరేగడి భూములున్నాయి.
* మధ్యభాగాన ఉన్న కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, బ్రహ్మసముద్రం, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, అనంతపురం, కూడేరు, ఆత్మకూరు, గార్లదిన్నె, పామిడి, పెద్దవడుగూరుమండలాల్లో ఎర్రనేలలున్నాయి.
* పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, మడకశిర, రొళ్ల, అగళి, గడిబండ మండలాలు మిగిలిన మండలాల కన్నా ఎత్తయిన పీఠభూమితో ఎర్రనేలలు కలిగి ఉన్నాయి.

ఖనిజాలు
జిల్లాలో ఇనుము, సున్నం, వెట్‌క్లే, నాచురల్‌క్లే, డోలమైట్‌, కాల్‌సైట్‌, బైరైటీస్‌, గ్రీన్‌క్వార్ట్‌జ్‌, బంగారు లోహాలు లభిస్తాయి. వజ్రకరూరు గ్రామంలో కింబర్‌లైట్‌ ఖనిజం ద్వారా వజ్ర నిక్షేపాలు ఉన్నాయి. తాడిపత్రి, యాడికి మండలాల్లో సిమెంటు తయారీకి అవసరమయ్యే సున్నపురాయి నిక్షేపాలున్నాయి. కలర్‌, నల్లనాపరాయి, ఫ్లోరింగ్‌కు పనికొచ్చే నాపరాయి నిక్షేపాలు ఉన్నాయి. ముచ్చకోట ప్రాంతంలో పేపర్‌ ఇండస్ట్రీస్‌, డిటర్జెంటుకు ఉపయోగించే సోప్‌స్టోన్‌ నిక్షేపాలు ఉన్నాయి. ధర్మవరం డివిజన్‌లోని రామగిరి వద్ద బంగారు నిక్షేపాలున్నాయి.

జిల్లాలో వాతావరణ పరిస్థితులు నాలుగు భాగాలుగా ఉంటాయి. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలికాలం, మార్చి నుంచి మే వరకు వేసవి, జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాల వల్ల వర్షం, అక్టోబరు నుంచి నవంబరు వరకు ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షం. కనిష్ఠ ఉష్ణోగ్రత డిసెంబరులో 16.8 డిగ్రీ సెల్సియస్‌గా ఉంటుంది. ఏప్రిల్‌, మే నెలల్లో 25.6 డిగ్రీల సెల్సియస్‌.
iskcon-temple-3

Comments

comments

You may also like...