• Uncategorized
  • 0

తల్లీకూతుళ్లను బండరాయితో మోది చంపిన భర్త

  • తల్లీకూతుళ్ల హత్య
  • ఇద్దరినీ బండరాయితో మోదిన భర్త
 హైదరాబాద్, చార్మినార్‌: భార్యతో గొడవపడి కోపంతో ఆమెను..అడ్డువచ్చిన కుమార్తెను బండరాయితో మోది హత్యచేశాడో భర్త. కందికల్‌గేట్‌ గులాం ముర్తుజా చావుని ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అహ్మద్‌, గౌసియాబేగం(36) భార్యా భర్తలు. వీరికి ముగ్గురు సంతానం. మహ్మద్‌ అహ్మద్‌ పనీపాట లేకుండా జులాయిగా తిరుగుతూ భార్యతో తరచూ గొడవ పడుతుంటాడు. ఆదివారం అర్ధరాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై అనుమానం పెంచుకు న్నాడు. సోమవారం తెల్లవారు జామున ఇంటి బయట నిద్రిస్తున్న గౌసియాబేగంతో గొడవకు దిగాడు.
            పక్కనున్న బండరాయితో ఆమె తలపై మోదాడు. కుమార్తె రుక్సానా బేగం(13) అడ్డురాగా ఆమెను కూడా దాంతో మోదడంతో తల్లీకూతుళ్లు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *