• Uncategorized
  • 0

MLA AND MLC’S SALARYS ARE INCREASED IN AP

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు పెరుగనున్నాయి. ఈ మేరకు సదుపాయాల కమిటీ అసెంబ్లీకి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల జీతం రూ.95వేలు ఉండగా దాన్ని రూ.లక్షన్నరకు పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. దీంతో పాటు హెచ్‌ఆర్ఏను కలిపి రూ.2లక్షల జీతాన్ని ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కమిటీ పేర్కొంది. వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రస్తుతం రూ.10లక్షల వరకు అవకాశం ఉంది. దీన్ని రూ.40లక్షలకు పెంచాలని సిఫారసు చేసింది. అలాగే పుస్తకాల కొనుగోలుకు రూ.లక్ష పెంచాలని అసెంబ్లీకి కమిటీ ప్రతిపాదించింది. జీతాల పెంపు అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తెలంగాణతో సమానంగా జీతాలు పెంచాల్సి అవసరం లేదని అభిప్రాయపడింది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *