• Uncategorized
  • 0

GANNAVARAM VIMANASRAYANIKI RANANNA ANTHARJATHIYAVIMANALU

(విజయవాడ) :గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను నడిపేందుకు ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, అభివృద్ధి పనులు ఎంత వేగంగా పూర్తిచేస్తే అంత త్వరగా విమానాలు ఇక్కడకు వస్తాయని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబు.ఎ అధికారులు, విమానాశ్రయ అభివృద్ధి పనుల నిర్వహణ కాంట్రాక్ట్‌ సంస్థలను ఆదేశించారు. బుధవారం ఆయన గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసే విధంగా అధికారులు కృషి చేయాలని అధికారులకు సూచించారు. విమానాశ్రయ విస్తరణ పనుల పురోగతిని ఎయిర్‌పోర్టు అధికారులు, స్టుప్‌ ప్రాజెక్టు మేనేజింగ్‌ కన్సల్టెన్సీలతో పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన అనుమతల మంజూరుకు తనవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఎయిర్‌ పోర్టు రనవే విస్తరణలో భాగంగా మూడు హైమ్యాక్స్‌ స్తంభాలను తొలగించి వేరేచోట ఏర్పాటు చేయాల్సి వుందన్నారు. ఈ మార్పును వెంటనే చేపట్టాలన్నారు. అవసరమైతే ట్రాన్సకో సహకారం తీసుకోవాలని ఎయిర్‌ పోర్టు అఽథారిటీ జనరల్‌ మేనేజర్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారి ప్రభాకర్‌కు సూచించారు. అదే విధంగా స్టుప్‌ ప్రాజెక్టు మేనేజింగ్‌ కన్సల్టెన్సీ చేపట్టిన నూతన ఎయిర్‌ పోర్టు టెర్మినల్‌ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్యాసింజర్‌ బిల్డింగ్‌ పనులు 50 శాతం పూర్తయినట్టు స్టుప్‌ సీనియర్‌ మేనేజర్‌ అనిల్‌ దీక్షిత కలెక్టర్‌కు వివరించారు. రాజధాని నేపధ్యంలో గన్నవరం విమానాశ్రయం ఖ్యాతి పెరగనున్నందున రోజువారీ పనులలో మరింత వృద్ధి కల్పించే విధంగా పనులు చేపట్టాలన్నారు.
ఎయిర్‌ పోర్టు నిర్మాణం పూర్తయితే అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి నడపటానికి ముందుకు వస్తున్నాయన్నారు. బ్రిటీష్‌ ఎయిర్‌ వేస్‌, సింగపూర్‌, గల్ఫ్‌, తదితర దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. స్టుప్‌ పీఎంసీ చేపట్టిన నూతన టెర్మినల్‌ పట్ల కలెక్టర్‌ సంతృప్తి వ్యకతంచేసి అదే స్ఫూర్తితో అనుకున్న సమయానికంటే ముందస్తుగా పనులు జరిగే విధంగా సహకరించాలని స్టుప్‌ సీనియర్‌ మేనేజర్‌ అనీల్‌ దీక్షిత బృందానికి కలెక్టర్‌ బాబు.ఎ సూచించారు. కలెక్టర్‌ వెంట ఎయిర్‌ పోర్టు అథారిటీ డైరెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

You may also like...