• Uncategorized
  • 0

రేషన్ దుకాణాల డీలర్లకిక విశ్రాంతి కరువు కానున్నది. కిందటి నెలలోనే వేకువ జాము నుంచే రేషన్ దుకాణాలు తెరవాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. సరుకుల రవాణాకు సంబంధించి కూడా జనవరిలో మార్పులు చేశారు. ఫిబ్రవరిలో రేషన్ దుకాణాల సమయాల్లో మౌలికంగా మార్పులు తీసుకువచ్చారు. అయితే రేషన్ డీలర్లు ఈ విధానాన్ని వ్యతిరేకించినప్పటికీ తప్పని పరిస్థితిల్లో అధికారుల ఆదేశాలను అమలు చేశారు. షాపులలో తెల్లవారు జాము నుంచి కూర్చోవడమనే విధానం ఒక్క నెల వరకేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏప్రిల్‌ నెల నుంచి ఖచ్చితంగా అమలు కానున్నది. మారిన దుకాణాల వేళలతో ఇక రేషన్ డీలర్లకు పదిరోజుల పాటు విశ్రాంతి కరువేనని చెప్పచ్చు. తాజాగా నూజివీడు సబ్‌కలెక్టర్‌ లక్ష్మీషా విడుదల చేసిన ప్రకటనలో రేషన దుకాణాలలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు సరుకులు పంపీణీ చేయాలని ఆదేశించారు. ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా సరుకులు ఇవ్వాలని ఆయన తన డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. RATION

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *