• Uncategorized
  • 0

UPPU THO MUPPU

సాధారణ ఉప్పు వా డకంతో భవిష్యత్‌లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కేంద్రం గుర్తించింది. వైద్య ఆరోగ్య శాఖల నివేదికల ప్రకారం అనేక మంది సాధారణ ఉప్పు వినియోగంతో రుగ్మతలకు గురవుతున్నారని తేలింది. దీంతో నిషేధిత వస్తువుల జాబితాలో ఉప్పు చేరింది. ఈ ఏడాది వినియోగదారుల హక్కు ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆహారంలో యాంటిబయాటిక్స్‌ అనే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే సాధారణ ఉప్పు స్థానంలో అయోడైజ్డ్‌ ఉప్పు వినియోగించాలని, సాధారణ ఉప్పు నిషిద్ధమని ప్రచారం చేస్తోంది.

వేసవిలోనే అధిక వినియోగం
సాధారణ ఉప్పు వినియోగం అధికంగా వేసవిలో నే ఉంటుంది. ఎండాకాలంలో వచ్చే పలు రకాల కూ రగాయలను ఉపయోగించి పచ్చళ్ల తయారీ చేస్తారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. వీటిల్లో ఎక్కువగా సాధారణ ఉప్పునే వినియోగిస్తారు. ఈ సీజన్‌లోనే సాధారణ ఉప్పు అమ్మకాలు అధికంగా ఉం టాయి. ఈ సమయంలో ఈ ఉప్పు వినియోగంపై ప్ర జల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులపైఅధికంగా ఉంటుంది. సాధారణ (కల్లు) ఉప్పు వినియోగంతో థైరాయిడ్‌ సమస్య తలెత్తుతుంది.
పురుషుల్లో వంధత్వానికీ ఇదీ ఒక కారణమని పరిశోధనల్లో తేలింది. సంతాన లేమితో బాధపడుతున్న వారిలో ప్రతి వంద మందిలో ఐదుగురు సాధారణ ఉప్పు వాడకమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.
రక్త హీనత, రక్తప్రసరణలో సమతుల్యత దెబ్బ తినడం వెనుక అయోడైజ్డ్‌ ఉప్పు వినియోగించకపోవడమే ఒక కా రణంగా వైద్యులు గుర్తించారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *