• Uncategorized
  • 0

Visakha Utsav Today Programs

ఎం.వి.పి.కాలనీ : విశాఖ ఉత్సవ్‌లో ఆదివారం జరిగే కార్యక్రమాల వివరాలను విడుదల చేశారు. వుడా పార్కు వేదిక ఎం.జి.ఎం.లో సాయంత్రం 5 గంటలకు డాక్టర్‌ మురళీబాబు బృందం మణిపురి నృత్యం, 5.30 గంటలకు వినోద్‌ గజల్స్‌, 6 గంటలకు స్నేహాంజలి ఆర్ట్‌ అకాడమీ డోల్‌ నృత్యం, 6.30 గంటలకు రంజిత్‌ బృందం స్ట్రింగ్స్‌, రాత్రి 7 గంటలకు బి.ఎ.నారాయణ మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమాలు జరుగుతాయి.

* మధురవాడ జాతర వద్ద తీన్‌మార్‌, చెక్క భజన, జాలరి నృత్యం, కర్రసాము, డప్పు నృత్యం, మయూర నృత్యాలు జరుగుతాయి.

* ప్రధాన వేదిక ఆర్కేబీచ్‌ వద్ద ఝాన్సీ వ్యాఖ్యాతగా సాయంత్రం 6 గంటలకు భాగవతుల సౌమ్య కూచిపూడి నృత్యం, 6.30 గంటలకు చైతన్య వారి అన్నమాచార్య కీర్తనలు, రాత్రి 7 గంటలకు కథక్‌, 7.45 గంటలకు శివారెడ్డి హాస్య కార్యక్రమం, 8.15 గంటలకు స్థానిక కళాకారుని నృత్యం, 8.30 గంటలకు సంప్రదాయ గిరిజన నృత్యం, 8.45 గంటలకు ఉషా వూతప్‌ బృందం మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

visakha program

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *