• Uncategorized
  • 0

Visakha Utsav Laser Show

విశాఖ ఉత్సవ్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి
ఆకట్టుకున్న లేజర్‌ షో
మద్దిలపాలెం : సాగరతీరంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమాలు రెండో రోజు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. సాగరతీరం జనసంద్రంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వుడాపార్కు వద్ద ఫ్లవర్‌షో, కార్నివాల్‌, ఆర్కేబీచ్‌లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్రలో ఉన్న తొమ్మిది దేవాలయాల నమూనాలను సందర్శించారు. అక్కడ నుంచి విశాఖ ఉత్సవ్‌ ప్రాంగణానికి ఓపెన్‌టాప్‌ వాహనంపై చేరుకున్నారు. వేదికపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో వేదికపై ఆశీనులయ్యారు. కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం గాల్లోకి బెలూన్లు ఎగుర వేశారు. అనంతరం లేజర్‌షో నిర్వహించారు. విశాఖ ప్రతిష్టను షోలో చూపించారు. వివిధరకాల దేవాలయాలు, కైలాసగిరి, వుడా, కేజీహెచ్‌, పోర్టుట్రస్టు, ఏయూ వంటివాటిని లేజర్‌షోలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సి.హెచ్‌.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ ముత్తంశెటి ్టశ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌మూర్తి, పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌, విష్ణుకుమార్‌రాజు, పీలా గోవిందరావు, పంచకర్ల రమేష్‌బాబు, పల్లా శ్రీనివాస్‌, వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌, జీవీఎంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ లాలం భవాని, వుడా వీసీ బాబూరావునాయుడు తదితరులు పాల్గొన్నారు.

laser show

 

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *