• Uncategorized
  • 0

Kohli 74 and Dhawan 74

పెర్త్‌: ఆసీస్‌తో కీలకమైన వన్డే, టీ-ట్వంటీ సిరీస్ ఆరంభానికి ముందు శుక్రవారం వాకా స్టేడియంలో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ-ట్వంటీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు శిఖర్‌ధావన్(74: 46 బంతుల్లో8 ఫోర్లు, 3 సిక్సర్లు ), విరాట్‌కోహ్లీ(74: 44 బంతుల్లో7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. వీరిద్దరూ.. రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌‌‌ ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్‌శర్మ వికెట్‌ను కోల్పోయింది. 12 బంతులెదుర్కొని 6 పరుగులు చేసిన రోహిత్‌శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ధావన్‌-కోహ్లీ ఇద్దరూ..వెస్టర్న్‌ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి రాణింపుతో భారత్ భారీ స్కోరు చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియా బౌలర్లలో నికోలస్, కెల్లీ, డుఫీల్డ్ చెరో వికెట్ పడగొట్టారు.

dhawan kohili

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *