• Uncategorized
  • 0

DSP – Devi Sri Prasad Found his Partner

దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన నాటి నుంచే అతణ్ణి హీరోను చేయాలని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ, సంగీత ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఈ రాక్ స్టార్ స్పీడ్‌ను ఎవరూ క్యాచ్ చేయలేకపోయారు. ఏమైనా ఇంతకాలానికి దిల్ రాజు-సుకుమార్‌ల చేతికి చిక్కాడు ఈ చక్కనోడు. దీంతో దేవీశ్రీని హీరోగా చూడాలని ముచ్చట పడుతున్న అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. మరి… సినిమా అనుకున్నాక హీరోయిన్ కావాలి కదా…! అందుకే దేవికి సరిగ్గా సరిపోయే నాయిక కోసం ఇండస్ట్రీనంతా జల్లెడ పట్టేసిన దర్శక-నిర్మాతలు… చివరకు సమంతే రాక్ స్టార్‌కు కరెక్ట్ జోడీ అని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు అమ్మడితో మంతనాలు కూడా మొదలయ్యాయని వినికిడి. మరి.. మన క్యూటీ బేబీ, దేవికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

dsp-samanta

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *