• Uncategorized
  • 0

CM Jayalalitha (Amma) involved in Whatsapp Controversy

చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత వాట్సాప్‌ ప్రచారానికి రూ. 50 కోట్లు ప్రజాధనం ఖర్చయిందని పీఎంకే ఆరోపణకు బుధవారం ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. సీఎం వాట్సాప్‌ ప్రచారానికి రూ. 50 కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారని పీఎంకే నేత డాక్టర్‌ రాందాస్‌ ఆరోపణలను లేవనెత్తారు. ఇది వాస్తవం కాదని వివరించిన అధికారులు ఓ టెలికాం సంస్థ 70 శాతం వరకు రాయితీ కల్పించడం వల్ల వాట్సాప్‌ ప్రచారానికి రూ. 3 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు, ఇదివరకే జీవోలో కూడా స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
వరద బాధితులను నేరుగా కలుసుకోవడం సాధ్యం పడని కారణంగా ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం అందుబాటులో వున్న సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ వాస్తవాలను దాచి రాజకీయ లబ్ది కోసం పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు ఆరోపించారు.
jayalalitha

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *