• Uncategorized
  • 0

2Crores for Olympics Gold medal

  • క్రీడాకారుల నగదు బహుమతి భారీగా పెంపు
  • క్రీడా విధానాన్ని సవరించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ : రాష్ట్ర క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. వివిధ క్రీడా పోటీల్లో పతకాలు నెగ్గిన క్రీడాకారులు, కోచ్‌లకు ఇచ్చే ప్రోత్సాహకాలను భారీగా పెంచింది. ఈ ఏడాదికి సవరించిన తెలంగాణ క్రీడా పాలసీని ప్రకటిస్తూ క్రీడల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు నెగ్గే రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఉమ్మడి ప్రభుత్వం రూపొందించిన పాలసీకి సవరణలు చేశారు. నూతన పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ. 25 లక్షల నుంచి ఏకంగా రెండు కోట్లకు పెంచింది. రజతానికి కోటి రూపాయలు, కాంస్యానికి రూ. 50 లక్షలు ఇవ్వనుంది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న వారికి రూ. 5 లక్షల ప్రోత్సాహకం ప్రకటించింది. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ (ఒలింపిక్‌ క్రీడలు)లో స్వర్ణం గెలిచిన వారికి ఇచ్చే నగదును రూ. 16 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచింది. ఆసియా క్రీడల్లో బంగారు పతకానికి రూ. 30 లక్షలు, కామన్వెల్త్‌లో స్వర్ణానికి రూ. 25 లక్షలు ప్రకటించింది. జాతీయ క్రీడల్లో స్వర్ణ, రజత, కాంస్యాలకు వరుసగా రూ. 5, 3, 2 లక్షలు అందజేయనుంది. ఇక కొత్తగా చెస్‌ టైటిళ్లు నెగ్గిన వారిని కూడా ప్రోత్సాహకాల జాబితాలో చేర్చింది. అదే విధంగా పారాలింపిక్స్‌, ప్రత్యేక ఒలింపిక్స్‌ విజేతలకు కూడా ఈ ఏడాది నుంచి నగదు ఇవ్వనుంది. జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు జరిగే క్రీడల్లో పతకధారులు నగదు అందుకోకున్నారు. పతకాల విజేతలు తాము ఆయా క్రీడల్లో రెండు సంవత్సరాలుగా సంబందిత కోచ్‌ వద్ద శిక్షణ తీసుకొని విజయం సాధించినట్లు డిక్లరేషన ఇవ్వాల్సి ఉంటుంది. క్రీడాకారులతో పాటు కోచలకు నగదు బహుమతి ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రాంత కోచలనే పరిగణిస్తారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రెండు సంవత్సరాలుగా సదరు కోచ శిక్షణ ఇస్తూ ఉండాలి. నగదు బహుమతులను తెలంగాణలో ఎక్కువగా ఆడే క్రీడలకు కూడా వర్తింపచేశారు. స్థానిక క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వ క్రీడలశాఖ ఇచ్చే గ్రాంట్‌ను పరిగణిస్తూ క్రీడలశాఖ ముఖ్యకార్యదర్శి లక్ష రూపాయల వరకు, తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల వరకు, క్రీడాశాఖ మంత్రి 3 నుంచి 5 లక్షల వరకు, 5 లక్షలకు పైబడిన వాటిని ముఖ్యమంత్రి అనుమతి ద్వారా మంజూరుచేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

gold medals

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *