• Uncategorized
  • 0

Precautions to be taken in a family where Diabetic Patient exist

Controlling-Diabetesఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా ? ఐతే ఈ జాగ్రత్తలు
– డైట్: కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డయాబెటీస్ తో బాధపడుతుంటే.. ముందుగా చేయాల్సిన పని.. మంచి డైట్ ఫాలో అవడం. ఫైబర్ ఫుడ్, తృణధాన్యాలు, గుండెకు మేలు చేసే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. ఈ మూడు రకాల ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. మధుమేహం రాకుండా కాపాడుకోవచ్చు.

– శ్యాచురేటెడ్ ఫుడ్స్ కి దూరంగా: శ్యాచురేటెడ్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ ని అసలు తీసుకోకూడదు. ఇంట్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే.. Hereditary కారణం గా వ్యాపించడానికి అవకాసం ఉంది. ఆరోగ్యకరమైన, తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది.

– వ్యాయామం: డయాబెటీస్ ని నిరోధించడానికి వ్యాయామం చాలా అవసరం. స్విమ్మింగ్, మెట్లు ఎక్కుడం, జిమ్ కి వెళ్లడం వంటి వ్యాయామాలు రెగ్యులర్ గా చేయడం వల్ల డయాబెటీస్ ని నియంత్రించవచ్చు. రోజుకి కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తారు.

– చెడు అలవాట్లను మానేయడం: మద్యంతాగడం, పొగతాగడం వంటి అలవాట్ల కారణంగా టైప్ టు డయాబెటీస్ కి కారణమవుతాయి. ముఖ్యంగా వంశపారంపర్యంగా వేగంగా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ అలవాట్లు ఉంటే నెమ్మదిగా మానేయడం మంచిది.

– చక్కెర: చక్కెర తీసుకోవడం ఎంత తగ్గిస్తే అంతమంచిది. షుగర్ కి బదులు తేనె, బెల్లం వంటివి తీసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటీస్ తో బాధపడుతున్నప్పుడు చక్కెర తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి.

– ఆయిల్స్ విషయంలో: కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నప్పుడు టైప్ టు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. దీనికి మనం తీసుకునె నూనెలు కూడా కొన్ని సందర్భాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వీటినే తీసుకోవాలి. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది… ఆరోగ్యానికీ మంచిది.

– బీపీ కంట్రోల్: ఫ్యామిలీలో ఎవరికైనా మధుమేహం ఉన్నప్పుడు బీపీ కంట్రోల్ లో ఉండేలా జాగ్రత్త పడాలి. హై బ్లడ్ ప్రెజర్ కారణంగా టైప్ టు డయాబెటీస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.

– ఒత్తిడికి దూరంగా: ఒత్తిడి రకరకాల అనారోగ్య సమస్యలకు కారనమవుతుంది. ప్రశాంతంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నప్పుడు ఒత్తిడి సాధ్యమైనంత వరకు దరిచేరకుండా చూసుకుంటే డయాబెటిస్ కు దూరంగా ఉండవచ్చు.

Comments

comments

You may also like...