• Uncategorized
  • 0

Minimum Intermediate Qualification Required To Participate in Elections

చండీగఢ్ : ప్రజా ప్రతినిధులు చదువుకున్నవారైతే ప్రజా సేవకు మరింత దోహదపడే అవకాశం ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. ఈ దిశగా హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారు కనీసం పదో తరగతి చదివి ఉండాలని నిబంధనలు విధించింది. దీనిని సుప్రీంకోర్టు ఈ నెల 10న ఇచ్చిన తీర్పులో సమర్థించింది. నిరక్షరాస్యులు పోటీ చేయకుండా దీనివల్ల నిరోధించవచ్చునని పేర్కొంది. దీంతో ప్రభుత్వానికి మరింత ఉత్సాహం వచ్చింది. పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకొనేవారికి కనీస విద్యార్హత 12వ తరగతి అని నిర్ణయించబోతోంది.
మునిసిపల్ కమిటీలు, కౌన్సిళ్లు, కార్పొరేషన్లకు పోటీ చేసేవారికి పన్నెండో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించబోతున్నట్లు హర్యానా అడ్వకేట్ జనరల్ బీఆర్ మహాజన్ తెలిపారు. రాష్ట మంత్రివర్గం ఆమోదించిన తర్వాత మునిసిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ రూల్స్, 1994; మునిసిపల్ ఎలక్షన్ రూల్స్, 1978లకు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హతను నిర్ణయించిన రాష్ట్రాల్లో హర్యానా రెండోది అవుతుంది. దీనిని అమలు చేసిన మొదటి రాష్టం రాజస్థాన్.
party

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *