• Uncategorized
  • 0

Don’t take these items on Empty Stomach

food-items-on-empty-stomachక్షణం తీరికలేని జీవనశైలిలో భాగంగా చాలామంది ఆరోగ్యం, తీసుకునే ఆహారం పట్ల దృష్టి పెట్టరు. ఎప్పుడు ఏం తీసుకుంటున్నారన్నది పట్టించుకోరు. కానీ పరగడుపున తీసుకునే ఆహారం, చేసే పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
ఆలస్యంగా లేచినప్పుడూ, అలవాటులో భాగంగానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీయాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. వికారం, వాంతుల వంటివీ బాధిస్తాయి.వీటన్నిటి కంటే మంచినీళ్లు తాగడం చాలా మంచిది.
* ఘాటైన మసాలాలూ, గ్రేవీ కూరల్ని ఉదయం పూట అదీ పరగడపున తీసుకోకూడదు. పొట్టలో తిప్పుతుంది. రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ బారిన పడే ప్రమాదముంది. అందుకే తేలిగ్గా అరిగే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి.
* చాలామంది నిద్రలేవగానే కాఫీ, టీ తాగుతుంటారు. పొద్దున వాటిని తాగడం మంచిదే కానీ పరగడుపున తీసుకోకపోవడం ఉత్తమం. వీటివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొదట గ్లాసు నీళ్లు తాగి.. ఓ పదినిమిషాల తరవాత వీటిని తీసుకోవాలి.
* పుల్లని పదార్థాల వల్లా ఉదయం పూట జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా టొమాటోలను పరగడుపున తీసుకోకుడదు. చాలామంది టొమాటో బాత్ లేదా, టొమాటో రైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినేముందు కాసిని పాలు తాగడమో, వేరే పదార్థమేదైనా తినడమో చేయాలి.
* కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగింగ్‌కు వెళ్లిపోతారు. అలాకాకుండా ఓ కప్పు గ్రీన్ టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి ముందూ ఇలానే చేయాలి. పొట్టలో ఏమీ లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరగదు.
* పరగడుపున అరటి పండు జోలికీ వెళ్లకూడదు. అరటి పండులో మెగ్నీషియం ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ మోతాదులో అందడం మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు.

Comments

comments

You may also like...