• Uncategorized
  • 0

Doctors Negligence Causes Damage To Baby Hand in the Womb

  • పొత్తిళ్ల చిన్నారి చేతులు విరగ్గొట్టిన డాక్టర్లు, సిబ్బంది
  • తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

వరంగల్: వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ పసిగుడ్డు రెండు చేతులు విరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులు దబ్బెట శైలజ,అశోక్‌ దంపతుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలో ని చింతనెక్కొండ గ్రామానికి చెందిన దబ్బెట అశోక్‌ తన భార్య శైలజకు నెలలు నిండడంతో ప్రసవం కోసం వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రిలో ఈ నెల 2న చేర్పించాడు. అదేరోజు సాయంత్రం శైలజకు వైద్యులు ఆపరేషన్‌ చేసి చిన్నారిని బయటకు తీసే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో కుడిచేయి విరిగింది. దీంతో చిన్నారి విపరీతంగా ఏడుస్తుండడంతో పరీక్షించిన వైద్యులు కండరాలు పట్టుకున్నాయని ఎక్స్‌రే తీయించాలని సూచించారు. ఎక్స్‌రే తీయించగా చేయి విరిగిన విషయం బయటపడింది. విరిగిన చేయికి కట్టుకట్టిన తర్వాత మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంలోని ఇంక్యూబేటర్‌లో ఉంచారు.
ఎంజీఎంలో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడి సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎడమచేయి కూడా విరిగింది. మళ్లీ ఎక్స్‌రే తీయించడంతో రెండో చేయి సైతం విరిగిన విషయం బహిర్గతమైంది. దీంతో రెండు చేతులకు కట్లు కట్టి ఈనెల 21న డిశ్చార్జి చేశారు. చేతులు విరిగిన విషయంపై ఏ డాక్టరును అడిగినా సరైన సమాధానం చెప్పకుండా దబాయించారని తల్లిదండ్రులు భోరున విలపించారు. ఎంజీఎంలో చికిత్స పొందిన సమయంలో లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారని చివరికి చిన్నారి చేతులు విరగ్గొట్టి తమకు అప్పజెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డామని వాపోయారు. రెండు చేతులూ విరగడంతో పసికందుతో పాటు తల్లిదండ్రులు సైతం తల్లడిల్లుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
pap

 

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *