• Uncategorized
  • 0

Am I Look Like 50 Years Old

  • నాకేమన్నా 50 ఏళ్లున్నాయా
  • ఆట బాగుంటే చాలదా!

ముంబై: ఆటతీరు బాగుండాలేగానీ, వయసుతో పనేముందని టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ (35) అన్నాడు. ఆస్ర్టేలియా పర్యటనలో జరిగే టీ-20 పోటీలకు ఎంపికైన హర్భజన్‌… వయసుమీరిందని తమను విమర్శించేవారికి ఘాటైన సమాధానమిచ్చాడు. ‘మాకేమన్నా 50 ఏళ్లున్నాయా? నడవలేకపోతున్నామా? అయినా ఆట బాగుండాలేగానీ వయసుతో పనేముంది. చాలామం ది ఆటగాళ్లు 38-39 ఏళ్లదాకా ఆడారు కూడా. ఇంకా ఆడాలన్న కాంక్ష నాలో ఉంది. ఎంపికయ్యేందుకు అది చాలదా’ అని భజ్జీ ప్రశ్నించాడు. కాగా భారత జట్టుకు తనతోపాటు బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆశీష్‌ నెహ్రా కూడా ఎంపికవడం ఆనందంగా ఉందని భజ్జీ చెప్పాడు. భారతకు వరల్డ్‌క్‌పను అందించాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. బౌలింగ్‌తోపాటు 7-8 స్థానాల్లో బ్యాటింగ్‌ కూడా చేయగలనని హర్భజన్‌ అన్నాడు.

hb

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *