• Uncategorized
  • 0

8086 DSC Posts Announced by Adnhra Pradesh Government

  • నియామకానికి లైన క్లియర్‌ 
  • డీఎస్సీ 2014 నుంచి వేరు చేసి భర్తీ 
  • 7,057 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 
  • 1,026 లాంగ్వేజ్‌ పండిట్‌ 
  • 3 స్కూలు అసిస్టెంట్‌ పోస్టులు 
  • సర్కారు గ్రీన్‌సిగ్నల్‌తో ప్రక్రియ షురూ
 

హైదరాబాద్‌ : డీఎస్సీ-2014 రాతపరీక్షలకు హాజరై, ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు తీపికబురు! 8,086 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి లైన క్లియర్‌ అవుతోంది. ఇందులో 7057 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ), 1026 లాంగ్వేజ్‌ పండిట్‌ (ఎల్‌.పి), మూడు స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యు కేషన) పోస్టులున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ నియామకాల అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నేపథ్యంలో కీలక కసరత్తు మొదలైంది. పాఠశాల విద్యా కమిషనర్‌ సంధ్యారాణి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్‌పీ సిసోడియాకు పంపారు. సర్కారు నుంచి గ్రీనసిగ్నల్‌ రాగానే నియామక ప్రక్రియ మొదలవుతుంది. డీఎస్సీ 2014 నోటిఫికేషన ద్వారా మొత్తం 10,313 టీచర్‌ పోస్టులను భర్తీచేయాలని పాఠశాల విద్యాశాఖ సంకల్పించింది. రాత పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల మార్కులను జిల్లాలకు పంపారు. ఈ క్రమంలో విడుదలయిన ప్రాథమిక కీపై పెద్దఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. వాటిని సవరించి తుది కీని విడుదల చేయగా, అందులోనూ తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు గుర్తించారు. అడ్మినిసే్ట్రటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి నియామకాలపై స్టే సంపాదించారు. ఫలితంగా డీఎస్సీ 2014 నియామకాలు నిలిచిపోయాయి. అలాగే లోకల్‌-నానలోకల్‌ అంశంపైనా కోర్టులో పిటిషన్లు పడ్డాయి. అన్ని కేసుల విచారణ పూర్తికాగా, కొన్నింటిపై తీర్పులు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో 7057 ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి న్యాయపరమైన ఇబ్బందులు లేనట్లు తేల్చారు. అలాగే 1026 లాంగ్వేజ్‌ పండిట్లు, మూడు స్కూల్‌ అసిస్టెంట్లు (ఫిజికల్‌ ఎడ్యుకేషన) పోస్టుల భర్తీలోనూ సమస్యలు లేనట్టు గుర్తించారు. ఆయా పోస్టులను డీఎస్సీ-2014 నుంచి వేరుచేసి ప్రత్యేకంగా నియామకాలు చేస్తే ఇబ్బంది లేదుగదా అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో డీఎస్సీ 2014 నియామకాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న భావనతో ఉన్న సర్కారు అకడమిక్‌ ఇనస్ట్రక్టర్‌ పేరిట టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేసుకునేందుకు అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదనను విరమించుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. డీఎస్సీ 2014కు సంబంధించి మిగిలిన 2,227 పోస్టులపై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.

ganta

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *