ఐపిల్ లో రైనా వర్సెస్ ధోని..?

ధోనీ హవా ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. టీమిండియా టీ-20, వన్డే కెప్టెన్‌.. ఐపీఎల్‌లో మరోసారి హాట్‌ కేక్‌గా అమ్ముడుపోయాడు. ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీల కోసం మంగళవారం నిర్వహించిన డ్రాఫ్టింగ్‌లో రూ. 12.5 కోట్లకు పుణె ధోనీని సొంతం చేసుకుంది. రైనాను కూడా మహీతో సమానంగా రాజ్‌కోట్‌ టీమ్‌ కొనుగోలు చేసింది. రహానె, అశ్విన్‌, స్మిత, డుప్లెసిస్‌లను పుణె సొంతం చేసుకోగా.. జడేజా, మెకల్లమ్‌, ఫాల్క్‌నర్‌, బ్రావోలను రాజ్‌కోట్‌ దక్కించుకుంది. మొత్తానికి ఎనిమిదేళ్లుగా చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ధోనీ, రైనా ఐపీఎల్‌లో తొలిసారిగా ప్రతర్థులుగా బరిలోకి దిగనున్నారు.

  • పుణెకు మహీ, రహానె, అశ్విన్‌, డుప్లెసిస్‌
  • రాజ్‌కోట్‌కు సురేష్‌, జడేజా, మెకల్లమ్‌
  • ఐపీఎల్‌ ప్లేయర్స్‌ డ్రాఫ్టింగ్‌

ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఐపీఎల్‌లో ఎంత డిమాండ్‌ ఉందో మరోసారి స్పష్టమైంది. ఇటీవల కాలంలో ధోనీ అంతగా ఫామ్‌లో లేకపోయినా.. కొత్త ఫ్రాంచైజీ పుణె మరో ఆలోచన లేకుండా తొలి ప్రాధాన్యత కింద రూ. 12.5 కోట్లకు మహీని సొంతం చేసుకుంది. వ్యాపారవేత్త సంజయ్‌ గోయెంకాకు చెందిన న్యూ రైజింగ్‌ కంపెనీ తక్కువకు బిడ్‌ వేసి పుణె ఫ్రాంచైజీని దక్కించుకోవడంతోపాటు.. డ్రాఫ్టింగ్‌లో ఆటగాడిని.. మొదటగా ఎంపిక చేసుకునే అవకాశం సొంతం చేసుకుంది. మంగళవారమిక్కడ జరిగిన ఐపీఎల్‌ టీమ్‌ల డ్రాఫ్టింగ్‌లో ధోనీతోపాటు టీమిండియా ఆటగాడు సురేష్‌ రైనాను తొలి ప్రాధాన్యంగా ఇంటెక్స్‌ మొబైల్స్‌కు చెందిన రాజ్‌కోట్‌ ఫ్రాంచైజీ చేజిక్కించుకుంది. ఆ ఫ్రాంచైజీకి తొలి ప్లేయర్‌ కావడంతో ధోనీతో సమానంగా రైనాకు కూడా రూ. 12.5 కోట్లు ముట్టనున్నాయి. ఐపీఎల్‌ స్కామ్‌ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై లోథా కమిటీ రెండేళ్ల సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఆ ఫ్రాంచైజీల స్థానాలను రెండేళ్ల కాలానికి పుణె, రాజ్‌కోట్‌తో భర్తీ చేశారు. చెన్నై టీమ్‌లోని ఏడుగురు, రాజస్థాన్‌ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లను కొత్త ఫ్రాంచైజీలు ఖరీదు చేశాయి. ఊహించని విధంగా రెండో ఆటగాడిగా అజింక్యా రహానెను పుణె, స్థానిక క్రికెటర్‌ రవీంద్ర జడేజాను రాజ్‌కోట్‌లు రూ. 9.5 కోట్లకు కొనుగోలు చేశాయి. మూడో ఆప్షన్‌గా ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను రూ. 7.5 కోట్లకు పుణె సొంతం చేసుకోగా, అంతే ధరకు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ను రాజ్‌కోట్‌ కైవసం చేసుకుంది. నాలు గో ఆటగాడి కింద ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మితను పుణె రూ. 5.5 కోట్లకు దక్కించుకోగా, ఫాల్క్‌నర్‌ను రాజ్‌కోట్‌ అంతే ధరకు కొనుగోలు చేసింది. ఇక చివరి ఆటగాడిగా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఫా డుప్లెసి్‌సను పుణె కొనుగోలు చేయగా, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావోను రాజ్‌కోట్‌ ఎంపిక చేసుకుంది. వీరిద్దరికీ రూ. 4 కోట్లు చెల్లించనున్నారు. ఈ పదిమందిలో రహానె, ఫాల్క్‌నర్‌, స్మితలు గతంలో రాజస్థాన్‌కు ఆడగా మిగిలిన వారు చెన్నై టీమ్‌ క్రికెటర్లు. సస్పెన్షన్‌ వేటుపడిన రాజస్థాన్‌, చెన్నై టీమ్‌లకు చెందిన 50 మంది ఆటగాళ్లను ఎంపికకు అందుబాటులో ఉంచారు. ఆసే్ట్రలియా ఆటగాడు షేన్‌ వాట్సన్‌ను ఎవరూ తీసుకోలేదు. అమ్ముడుకాని ఆటగాళ్లను ఫిబ్రవరి 6న జరిగే వేలంలో ఉంచుతామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా చెప్పారు. ‘ఇంతకు ముందు టీమ్‌లతో జరిగిన ఒప్పందం ప్రకారమే ఆటగాళ్ల జీతాలు ఉంటాయి. మొత్తం వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామ’ని మీడియా సమావేశంలో శుక్లా చెప్పాడు. రెండు జట్లూ రూ. 39 కోట్ల చొప్పున ఖర్చు చేశాయి. మిగిలిన రూ. 27 కోట్లలోనే మిగతా టీమ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంద’ని ఆ అధికారి చెప్పాడు.

కెప్టెన్సీ రేసులో రైనా, మెకల్లమ్‌!
రాజ్‌కోట్‌ జట్టు పగ్గాలు ఎవరికి అప్పజెబుతారనేది ఆసక్తిగా మారింది. టాప్‌ ప్లేయర్‌గా తీసుకున్న రైనాను కెప్టెన్‌గా నియమిస్తారా? లేక అనుభవజ్ఞుడైన బ్రెండన్‌ మెకల్లమ్‌కు జట్టు బాధ్యతలు అప్పగిస్తారా అనేది చర్చనీయాంశమైంది. అయితే రాజ్‌కోట్‌ టీమ్‌కు భారత ఆటగాడు కెప్టెన్‌గా ఉంటే మంచిదని మాజీ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. స్థానిక పరిస్థితులు, స్థానిక ఆటగాళ్లతో పరిచయం జట్టు బలాన్ని పెంచుతుందన్నాడు.

rn

Comment here