ఐపిల్ లో ధోని కి పెరిగిన డిమాండ్

టీమిండియా వన్డే కెప్టెన్‌ ధోనీని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందనే దానిపైనే ఎక్కువ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నా యి. తక్కువ బిడ్‌ దక్కించుకున్న టీమ్‌ మొదటి చాయిస్‌ ధోనీనే అనడంలో సందేహంలేదు. ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై నిలకడైన ఆటను ప్రదర్శించింది. దీంతో మహీ హాట్‌కేక్‌ అని ముం దు నుంచే అనుకుంటున్నారు. బిడ్డింగ్‌ రూల్స్‌ ప్రకారం తక్కువ కోట్‌ చేసిన ఫ్రాంచైజీకి మొదటి ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ధోనీని పుణె దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చెన్నై, రాజస్థాన్‌లోని పది మంది టాప్‌ క్రికెటర్ల కోసం రెండు కొత్త ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. ఇక మిగతా క్యాప్డ్‌ ప్లేయర్స్‌ అశ్విన్‌, జడేజా, రహానె, మెకల్లమ్‌, వాట్సన్‌ కోసం కూడా పోటీ నెలకొనే అవకాశం ఉంది.

Comment here