• Uncategorized
  • 0

పిల్లలకు చదువే కాదు “ఆటలు” ముఖ్యమే

సత్తెనపల్లి: బాలబాలికలకు చదువు ఎంత ముఖ్యమో, ఆటలు అంతే ముఖ్యమని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. స్కూ ల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఆధ్వర్యంలో రాష్ట్రస్ధాయి అండర్‌-14, 17 ఫెన్సింగ్‌ (కత్తిసాము) స్కూల్‌ గేమ్స్‌ను మంగళవారం ఎనటిఆర్‌ కళాక్షేత్రంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జ రిగిన సభకు మున్సిపల్‌ చైర్మన యెల్లినేడి రామస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్‌ డాక్టర్‌ కో డెల శివప్రసాదరావు మాట్లాడుతూ ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయన్నారు. పోటీలను నిస్పక్షపాతంగా నిర్వహించాల ని నిర్వాహకులకు ఆయన సూచించారు. గెలిచినవారు మరింతగా ఆడి ఉన్నత స్ధాయిలో గెలుపొందాలన్నారు. ఓడినవారు మళ్లీ గెలిచేందుకు ప్రయత్నించాలన్నారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. దేశ భవిష్యత విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు. చదువుతో జీవన విధానం మారుతుందన్నారు. మూడు రోజులపాటు జరి గే పోటీలలో విద్యార్ధులు ప్రతిభను ప్రదర్శించాలన్నారు. ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ ఆ టల ద్వారా ఆరోగ్యం వస్తుందని చదువులో చురుకుదనం వ స్తుందన్నారు. క్రీడలు కూడా చదువులో భాగమేనన్నారు. ము న్సిపల్‌ చైర్మన యెల్లినేడి రామస్వామి మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఫెన్సింగ్‌ కోచ లక్ష్మణ్‌, ఏపీ వ్యా యామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బి.కరిముల్లారావు, పీఈటీలు అమ్మయ్య, వై.సాంబశివరావు, కె.నాగభూషణం, ఎం.నాగేశ్వరరావు, పి.మస్తానరెడ్డి, గౌస్‌బేగ్‌, అమ్మయ్య, పిచ్చ య్య ఎంపీడీవో పద్మాకర్‌, బాలికల ఉన్నత పాఠశాల హెచఎం అరుణశ్రీ, లక్ష్మీనారాయణ, డిప్యూటీ డీఈవో శేషుబాబు, డిఎస్పీ మధుసూదనరావు, టీడీపీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు పి.వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

indian-chess-2

Comments

comments

You may also like...