• Uncategorized
  • 0

‘నాటి శ్రీశ్రీ ఆలోచనలు = నేటి శ్రీశ్రీ చేతల్లో

‘‘నాటి శ్రీశ్రీ ఆలోచనలు నేటి సగటి మనిషికి కలిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అనేదే మా ‘శ్రీశ్రీ’ సినిమా’’ అని అంటున్నారు ముప్పలనేని శివ. ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీశ్రీ’. కృష్ణ, విజయనిర్మల, నరేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌.బి.ఎస్‌. ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. శ్రీ సాయి దీప్‌, బాలురెడ్డి, షేక్‌ సిరాజ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి కృష్ణ మాట్లాడుతూ ‘‘శ్రీశ్రీ టైటిల్‌ వినగానే మహాకవి గుర్తుకొచ్చారు. ఆయన ఆవేశాన్ని రాతల్లో చూపిస్తే, మా శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 75 శాతం షూటింగ్‌ పూర్తయింది. చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’’ అని అన్నారు.
‘‘చిత్ర కథతో పాటు మా పాత్రలు కూడా నచ్చాయి. 70వ ఏట నేను రీ ఎంట్రీ ఇస్తున్నాను. ఇలాంటి పాత్రలు వస్తే మరిన్ని చిత్రాల్లో నేను, కృష్ణగారు నటిస్తాం’’ అని విజయనిర్మల చెప్పారు.
‘‘కృష్ణగారు సామాజిక స్ఫూర్తి ఉన్న వ్యక్తి. ప్రతి దశాబ్దంలోనూ తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. ఇందులో నేను కీ రోల్‌ చేస్తున్నాను’’ అని నరేష్‌ అన్నారు.
‘‘కృష్ణగారు నటుడిగా అర్ధశతాబ్ద వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ ఆయనకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. జనవరి 25కి తొలి కాపీని సిద్ధం చేసి, ఫిబ్రవరి 12కి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. తమ ప్రొడక్షన్‌లో ఇది తొలి సినిమా అని, కృష్ణగారితో పనిచేయడం ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పారు.

 

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *