• Uncategorized
  • 0

అభిమానులుకు సాయం అందించిన సూపర్ స్టార్ రజని

సూపర్‌స్టార్ రజనీకాంత్.. తమిళనాట ఎంతోమందికి ఆరాధ్యుడు. సినిమాల్లో తన స్టైలిష్ పెర్ఫార్మన్స్‌తో అభిమానులను అలరించిన తలైవా, సినిమాకి నష్టాలొస్తేనే ఆ భారాన్నంతా తన నెత్తిన వేసుకుంటారు. అలాంటిది తనను అంతలా అభిమానించే ప్రజలు కష్టాల్లో మునుగుతుంటే ఆయన స్పందన ఎలా ఉంటుందనడానికి తాజా సంఘటనే సజీవ సాక్ష్యం. చెన్నై వరదల సహాయ కార్యక్రమాలకు రజనీకాంత్ పది కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. అదీ ఎవరికీ తెలీకుండా తన సతీమణి లతా రజనీకాంత్‌తో ఈ సహాయం అందించటం విశేషం. కొద్ది రోజుల క్రితం తక్షణ సాయంగా రూ.10 లక్షలను అందించిన రజనీ ఇప్పుడు ఇంత భారీ మొత్తం విరాళంగా ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలోనూ గర్భిణీలకు సంబంధించి ఓ కార్యక్రమానికి 10 కోట్లు ఇచ్చారు రజనీ. విరాళాలతో పాటు తన కళ్యాణమండపంలో చెన్నై వాసులకు ఆశ్రయం కల్పించిన రజనీ ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని కొన్ని వాదనలు వినిపిస్తుంటే.. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండేందుకే అని రజనీ వర్గీయులు బదులిస్తున్నారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *