• Uncategorized
  • 0

అంగన్వాడీ ల లో పనికి రాని పాలు

హిందూపురం: చిన్నారులకు, గర్బిణిలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడానికి ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం అందజేస్తున్న పాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో మొదట పౌష్టికాహారం, కోడిగుడ్లు అందించేవారు. అయితే గత 6 నెలల నుంచి పాలడైరీ ఆధ్వర్యంలో పాల పాకెట్‌లను అందిస్తున్నారు. కానీ ఆ పాలు చిన్నారులు కూడా తాగలేనంత దుర్వాసన వస్తున్నాయి. దీంతో ఆ పాలు తమకు వద్దంటూ గర్భిణులు, బాలింతలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై సీడీపీఓ నాగమళ్లీశ్వరితో వివరణ కోరగా.. కొంత కాలంగా అంగన్‌వాడీ కేంద్రాలకు అందిస్తున్న పాలు దుర్వాసన వస్తున్నాయన్న సమాచారం తమకు కూడా అందిందని దీనిపై పాలడైరీ మేనేజర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కొత్త యంత్రాలు వస్తున్నాయని, త్వరలోనే నాణ్యమైన పాలు అందిస్తామన్నారని సీడీపీఓ తెలిపారు. పాలవల్ల తమకు ఏదైనా జరిగితే అందుకు సీడీపీఓ, పాలడైరీవారే భాద్యత వహించాల్పి వస్తుందని వినియోగదారులు హెచ్చరిస్తున్నారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *