“బ్యాంకాక్ వీధుల్లో కబాలి”

రోబో’ తర్వాత విడుదలైన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయకపోవడంతో తన లేటెస్ట్ మూవీ కబాలి మీదే దృష్టి అంతా నిలిపాడు రజనీకాంత్. రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రజనీ డ్యుయల్ రోల్ చేసే అవకాశం ఉందని వినిపిస్తోంది. కోలీవుడ్ వర్గాల ప్రకారం రజనీ ఈ సినిమాలో అండర్ వరల్డ్ డాన్ గా.. మలేసియన్ అండర్ కాప్‌గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. ఇప్పటివరకు చెన్నై, మలేసియాలో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యూనిట్ తాజాగా బ్యాంకాక్‌కు షిఫ్ట్ అయింది. ఈ షెడ్యూల్‌లో రజనీపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారని సమాచారం. కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణతో వరుసగా రెండు సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే… రజనీకాంత్ సరసన చోటు దక్కడంతో బోలెడంత ఆనందపడుతోంది. ఐశ్వర్య రాయ్ గెస్ట్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.kabali

Comment here