• Uncategorized
  • 0

“ఇసుక విక్రయం ద్వార వచ్చిన ఆదాయం రూ 821.21కోట్లు”

విజయవాడ : రాష్ట్రంలో ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శ్వేత పత్రం విడుదల చేశారు. ఇసుక విధానం అమలు, లోటుపాట్లు, ప్రయోజనాలు, ఆదాయంపై తదితర అంశాలను ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ 2015 నవంబర్‌ నాటికి రాష్ట్రంలో 387 ఇసుక రీచ్‌లు ఉన్నాయని, 1,37,89,000 వేల మందికి ఇసుక విక్రయాలు చేసినట్లు తెలిపారు.
ఇసుక విక్రయం ద్వారా రాష్ట్రానికి రూ. 821.21 కోట్ల ఆదాయం వచ్చిందని సీఎం పేర్కొన్నారు. 4,023 స్వయం సహాయక గ్రూపులు ఇసుక రీచ్‌లను నిర్వహించాయన్నారు. ఇసుక విక్రయాలా ద్వారా తూ.గో జిల్లాలో అత్యధికంగా రూ. 143 కోట్ల ఆదాయం రాగా, ప్రకాశం జిల్లాలో రూ. 12.79 కోట్ల అత్యల్ప ఆదాయం వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు రీచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాహనాలకు జీపీఎస్‌ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని తెలిపారు. జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో తవ్వకాలు తెలుసుకునేందుకు విజయవాడలో కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో ఇసుక విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.cm

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *