Akhil movie dates confirmed

akkineni-akhil-movie-release-date
Sensational Director VVV- Varasa Vijyala Vinayak is going to make movie with Akkineni family latest sensation Akhil movie under the banner Sresht Movies wherein Nitin will be the producer.
భారీ సెట్‌లో క్లైమాక్స్..!
ఆగస్ట్ 11 నుండి ఈ చిత్రం కోసం హైదరాబాద్ సంఘీ ఫారెస్ట్‌లో కోట్లాది రూపాయల వ్యయంతో వేసిన భారీ సెట్‌లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఫైట్ మాస్టర్ రవివర్మ సారధ్యంలో పెద్ద ఎత్తున చిత్రీకరించడం స్టార్ట్ చేశారు. ఈనెల 23 వరకు ఈ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. దీనితో 3 పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది.
యూరప్‌లో పాటలు..
నిర్మాత నితిన్ మాట్లాడుతూ..‘‘ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 12 వరకు యూరప్‌లో రెండు పాటలు చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ 18 నుండి 23 వరకు హైదరాబాద్‌లో భారీ సెట్స్‌లో చివరి పాట చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుంది’’.
నాగార్జున బర్త్‌డేకి ఫస్ట్‌లుక్..
అక్కినేని జయంతికి ఆడియో..
ఆగస్ట్ 29 నాగార్జున బర్త్‌డే కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేస్తాం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న ఈ చిత్ర ఆడియోను ఆవిష్కరిస్తాం. అక్టోబర్ 21న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నితిన్ చెప్పారు.
ఇది నా అదృష్టం- సయేషా
హీరోయిన్ సయేషా మాట్లాడుతూ…‘‘ఆగస్ట్ 12 నా బర్త్‌డే. ఇంత పెద్ద బేనర్‌లో నేను నటించడం నాకు నిజంగా హ్యాపీ బర్త్‌డే. అఖిల్ డెబ్యూ మూవీలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఇచ్చిన వినాయక్ గారికి, నితిన్‌కి నా కృతజతలు. ఈ చిత్రం నా కెరీర్‌కి పెద్ద ప్లస్ అవుతుంది. అఖిల్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది’’ అని చెప్పింది.
బిజినెస్ క్రేజ్…
నిఖితారెడ్డి మాట్లాడుతూ….‘‘అఖిల్ సూపర్‌గా నటిస్తున్నాడు. వినాయక్ గారు ఎక్స్‌లెంట్‌గా తీస్తున్నారు. మా బేనర్‌కి ఇది ప్రెస్టీజియస్ ఫిలిమ్ అవుతుంది. బిజినెస్ పరంగా ఈ చిత్రానికి చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. బయ్యర్లందరూ ఈ సినిమా కోసం పోటీలు పడడం విశేషం. అక్టోబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమ తదితరులు నటిస్తున్నారు.

Comment here