• Uncategorized
  • 0

Chandrababu Instructs strictly Officials about Pushkara arrangements

paurnami-harathi-godavariగోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం గోదావరి పుష్కరపనులపై చంద్రబాబు ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.
ఇంతవరకు జరిగిన పనులపైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాల పనుల పూర్తిలో అధికారులు విఫలమయ్యారని కార్పొరేషన్‌ కమిషనర్‌ మురళీపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌, కార్పొరేటర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పుష్కర ఏర్పాట్లపై చిన్న ఫిర్యాదు వచ్చినా కఠిన చర్యలు తప్పవని… రహస్యంగా కాకుండా బహిరంగంగా మీడియా ముందు చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. అందరూ చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.
గోదావరి హారతి మరింత బాగా జరగాలని సూచించారు. పుష్కరాల కోసం పర్యవేక్షణ కమిటీ, నిర్వహణ కమిటీతో పాటు రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు. పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించాలని…పుష్కరాల ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలని అన్నారు. గోదావరిని అందరూ భక్తి భావంతో చూడాలని….అదే మన భవిష్యత్‌ అని సీఎం చంద్రబాబు తెలిపారు. పుష్కరాల్లో పనిచేసే ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌ అమలు చేయాలని బాబు ఆదేశించారు.
రాజమండ్రి- కొవ్వూరు మధ్య గోదావరిపై ఫోర్‌లైన్‌ బ్రిడ్జ్‌ ఇంకా పూర్తి కాకపోవడంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై గామన్‌ ఇండియాపై మండిపడ్డారు. త్వరలో పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో సంస్థను బ్లాక్‌ లిస్టులో పెడతానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Comments

comments

You may also like...