• Uncategorized
  • 0

“శ్రీ వల్లభ గణపతి ట్రస్ట్, రాజమహేంద్రవరం”

vallabha-ganapati

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారిచే ప్రతిష్ఠ గావింపబడ్డ నాగ సహిత పంచదశ గణపతులతో కూడిన “శ్రీ వల్లభ గణపతి” మందిరములో ఫాల్గుణ కృష్ణ త్రయోదశి, బుధవారం 18.03.2015న “మండలాభిషేకం” `నిగమాభిజ్ఞ ‘ బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి’ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడింది.

కార్యక్రమ వివరాలు: దీక్షాబంధనం, పుణ్యాహవచనం, కళశావాహన, మహా గణపతి మూల మంత్ర జపములు, హోమములు, తర్పణలు, సుబ్రహ్మణ్య హోమం, స్నపనాధ్యాయంతో దేవతా కళల ప్రతిష్ఠాపన, 96 కళలను మంత్రపూర్వకంగా ఆవాహన, కళశోద్వాసన. కుంభాభిషేకం. శ్రీ వల్లభగణపతి మూలవిరాట్టుకు గణపతి అథర్వ శీర్షం సహస్ర ఆవృత్తులతో (వెయ్యిమార్లు) అభిషేకం. మరో అదృష్టం ఏమిటంటే మూలమంత్ర ఉపదేశం ఉండి అక్కడకి వచ్చిన శిష్యులందరికీ వారి స్వహస్తాలతో మూలవిరాట్టుకు అభిషేకం చేసే భాగ్యాన్ని కల్పించారు.

ఇవేకాక అదే ఆలయంలో “జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యు”ల వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రిగారు మాట్లాడుతూ..”బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వంటి సత్పురుషుల స్వభావం `స్వయం తీర్ణాః పరాం తారయతి ‘అని చెప్పినట్లుగా వారి దేవతార్చన, అనుష్ఠానాదులు వారికి చాలు. మనందరం దేవతానుగ్రహంపొంది తరించడానికి ఈ ప్రతిష్ఠ చేసారు. దానికి మనం చేయాల్సింది ఏమిటంటే పర్వదినాలలో, చతుర్థీ తిధులయందు, వారి వారి జన్మ దినములందు ఇక్కడకు రావడం, అర్చనలు, హోమాలు,అభిషేకాదులు వంటివి చేసి గణపతి అనుగ్రహం పొంది తరించాలి. ఈ గణపతిని అర్చిస్తే సర్వదేవతారాధన ఫలితం వస్తుంది. అంతే కాక దేవతా శక్తి, దేవాలయ శక్తి నిలుస్తాయి. “ఇప్పుడు దేవాలయాలకు కావాల్సినది మంత్ర నిధి”. దేవాలయంలో వారి వారి అనుష్ఠానాదులు చేస్తే ఆ శక్తి నిలుస్తుంది. మండలాభిషేకం తప్పక చేయాలని శాస్త్రం చెప్తోంది. ప్రతిష్ఠించిన 40 రోజులలో తెల్సీ తెలియక ఎమైనా లోపాలు జరిగిఉంటే దీని ద్వారా మరల ఆ దేవతా చైతన్యాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. పురశ్చరణ చేసి ప్రతిష్ఠిత దేవతకి ధారాదత్తం చేయాలి. ఇది చేసిన వారికి సర్వ దేవతారాధన ఫలితం వస్తుంది.

ఎన్నో దేవాలయాలు చూస్తూ ఉంటాం..ప్రతిష్ఠించిన తరువాత ఆగమ ప్రకారం మంత్రం, పూజలు లేక దైవశక్తి తగ్గుతుంది. ఎందుకు ప్రతిష్ఠించానా అని బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ దేవతా ప్రతిష్ఠచేయించడం మా భాగ్యంగా భావిస్తున్నాం. ఇక్కడ అర్చకుడు కుర్రవాడైనా మూలమంత్రాన్ని గురుముఖతః ఉపదేశం పొంది చతుర్లక్ష జపం, హోమ తర్పణాదులన్నీ సశాస్త్రీయంగా చేసినవాడు. గణపతి పంచావరణార్చన, షణ్ణవతి (96) కళలతో ఆవాహనాదులు తెలిసినవాడు”.

ఆ దేవాలయంలో అర్చనల వివరాలు:
ప్రతిరోజు ఉదయం 6 నుండి 11 వరకు, మరల సాయంత్రం 5 నుండి 8 వరకు
ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటలకు మూల విరాట్టుకు అభిషేకం.
ఉభయ చవితులకి విశేష అర్చనలు
ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు సామూహిక గణపతి సహస్ర నామ పారాయణ, సత్సంగము.

vallabha-ganapati-2

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *