ఆరోగ్య శ్రీ వైద్య సేవలను దూరం చేస్తున్న కంప్యూటర్లు…

arogyasri

గుండె నొప్పితో వైద్య సాయం కోసం ఎదురు చూస్తోన్న 79 సంవత్సరాల వృద్దురాలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు ఆదుకోవాలని పేదరాలు విజ్ఞప్తి…

ఒక పధకం ప్రకారం… వ్యూహత్మకంగా … రేషన్ కార్డుల సమాచారం గల్లంతు అవుతోంది.. అదేమిటని ప్రశ్నిస్తే సరైనా సమాధానం ఇచ్చే వారు కరవయ్యారు.. రేషన్ కార్డులలో కుటుంబ సబ్యులు అందరు వివరాలు ఉన్నప్పటికీ … ఫొటోలు ఉన్నప్పటికీ కొంతమంది పేర్లు లేవని నిత్యావసర వస్తువులు నిలిపి వేస్తున్నారు.. ఎన్ని సార్లు కార్యాలయానికి వెళ్ళి ఆధార్ కార్డుల జిరాక్సులు .. వివరాలు అందజేసినప్పటికీ నమోదు చేస్తున్నామని చెబుతున్నారు.. రెండు మూడు నెలల్లో అప్ డేట్ అవుతుందని చెబుతున్నారు.. నెలలు గడుస్తున్నా సరే ఫలితం కనిపించడం లేదు.. భార్యా భర్త ఇద్దరి ఫొటోలు రేషన్ కార్డులో ఉంటాయి.. కానీ అధికారుల వద్ద ఉన్న కంప్యూటర్ జాబితాలో భర్త పేరు గల్లంతు అవుతోంది.. కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ అన్ని వివరాలు అందిస్తే.. తరువాత భర్త పేరు నమోదు చేసి భార్య పేరు గల్లంతు చేస్తున్నారు.. మరికొంత మందికి అయితే రేషన్ కార్డులు ఉంటున్నాయి.. అయితే కంప్యూటర్ జాబితాలో కార్డు మొత్తం అదృశ్యం అవుతోంది.. కనిపించడం లేదని చెబుతున్నారు.. అంతా కంప్యూటర్ దయా దాక్షిణ్యాల పై భారం వేయాల్సి ఉంటోంది.. ఇదే పేదలకు.. వృద్దులకు… పెను ప్రమాదంగా మారింది.. ఆరోగ్యశ్రీ సేవలను పేదల దరిచేరనీయకుండా అధికారుల కంప్యూటర్లే అడ్డు పడుతున్నాయి.. రాజమండ్రి నగరం ధవళేశ్వరం గ్రామానికి చెందిన.. కాగితపు లక్ష్మీనారాయణమ్మ ఇపుడు 79 సంవత్సరాలు.. ఆమె అస్వస్ధతకు గురయ్యారు.. హృదయానికి సంబంధించిన వైద్యం చేయాల్సిన అవసరం ఏర్పడిందిన వైద్యుల సూచన… నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె లక్షల రూపాయలు వెచ్చించే స్ధోమత లేదు..గంట.. గంటకు.. గుండె నొప్పి తీవ్ర మవుతోంది.. 23/09/2009 సంవత్సరంలో జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు….(WAP0429023A0394 ), … 5/12/2007 సంవత్సరం జారీచేసి ఆరోగ్య శ్రీ కార్డు తీసుకుని రాజమండ్రి నగరంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి ఆమెను కుటుంబ సభ్యులు తీసుకు వెళ్ళారు.. అక్కడ కంప్యూటర్ లలో ఈ కార్డుల సమాచారం లేదని వైద్యసేవలకు నిరాకరించారు.. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దనే వైద్య సహయం అందక నిస్సహాయంగా ఉన్నారు.. రాష్ర్టముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి లో కంప్యూటర్లే పేదలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలను దూరం చేస్తున్నాయి…పేదల బతుకులను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి…

వృద్దురాలి కుమారుడు కాగితపు వీరభాస్కర్ కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు.. మాతృమూర్తికి వైద్య సేవలు అందించాలని వేడుకుంటున్నారు.. ఫోన్ నెంబరు 93478 79336…

#arogyasree #NTRabhayahastham #NTRAarogyapadhakam #NTRBharosa #aarogyasri #arogyasri

Comment here